#38Let Us, with a Gladsome Mind
Author: జాన్ మిల్టన్ (అను: బర్నార్డ్ లూకాస్)Category: దైవారాధన — దైవస్తుతి
1.
కృపగల దేవుని సర్వదా నుతించండి
దివ్య కృపా ప్రేమలు ఎల్లకాలముండును.
2.
సర్వశక్తుడాయన సర్వదా చాటించండి
దివ్య కృపా ప్రేమలు ఎల్లకాలముండును.
3.
పగటి నేలునట్లు సూర్యుని సృజించెను
దివ్య కృపా ప్రేమలు ఎల్లకాలముండును.
4.
సర్వజీవకోటిని బ్రోచు దేవుడెన్నడు
దివ్య కృపా ప్రేమలు ఎల్లకాలముండును.
5.
కర్త మనయందును కనికర ముంచెను
దివ్య కృపా ప్రేమలు ఎల్లకాలముండును.
6.
దైవ ఘన మహిమను జాటుచుండండి
ఇల కృపగల ప్రేమలు ఎల్లకాలముండును.