FaithWalk
← Back to Library

#37A Mighty Fortress Is Our God

Author: మార్టిన్ లూథర్ (అను: డి. పాల్)Category: దైవారాధన — దైవస్తుతి
ప
మా కర్త గట్టి దుర్గము నే నమ్ము ఆయుధంబు సంప్రాప్తమైన కష్టములను అన్నిటి నణంచు నా పాత శత్రు వెంతో క్రూరుడు తదాయుధములు ఉపాయ శక్తులు అతండసమానుడు. మేమేమో నశించిపోదుము మా శక్తి నిష్ఫలంబు మాకై ప్రభుని శూరుడు యుద్ధంబు చేసిపెట్టు అతడెవ్వడు? యేసు క్రీస్తును మా రక్షకుడు మరొక్కడెవ్వడు? ఆతడే గెలుపొందు. ప్రపంచమంతటన్ గ్రమ్ము పిశాచాలేమి చేయు? మమ్మెల్ల మ్రింగనున్నను మాకేల భీతి చేయు? ఈ లోకాధిపుడు ఉగ్రుడైనను దానికేమి చేయున్? ధీర్పొందె నాతడు నశించు మాటతోనే. వాక్యంబు నిత్యమే గదా విరోధి వంచలేడు. దైవాత్మ తోడగు గదా తా నిన్న నేడు రేపు. మా కుటుంబము మా కీర్తి, యాస్తి, ప్రాణంబు పోయినన్ నష్టంబు వానిదే రాజ్యంబు మాది యౌను.