#36Now Thank We All Our God
Author: మార్టిన్ రిం కార్ట్ (అను: జె. హెచ్. హార్మ్స్)Category: దైవారాధన — దైవస్తుతి
1.
సర్వాద్భుతంబులవలె సర్వత్ర చాటించు
కర్తవైన సర్వాత్మలంతట శ్లాఘింప
జేరరండి! మా రాకపోకలన్ మమ్ము
వీడకుండను మా రక్షకుడిట్లే మమ్మాదరించును.
2.
మహా దయాళుడే మా జీవకాలమంత
సహాయమూర్తియై సంతోషమిచ్చుగాక!
మహత్తు ప్రేమను మాయందు నుంచును
ఇహంబునన్ మమ్ము నెన్నడు బ్రోచును.
3.
ప్రపంచపాలకా! ప్రసిద్ధుడైన తండ్రీ!
సుపుత్ర దేవుడా! సుజీవమిచ్చు నాత్మా!
సంపూర్ణ త్రేకుడా! ప్రఖ్యాతికలగగా
అపారసన్నుతి నర్పింతు సర్వదా.