#337పాపక్షమ
Author: మల్లెల దావీదుComposer/Ragam: ఖరహరప్రియ (ఛాయ: प्रभुవా పంపుమయా)Category: దేశీయ ప్రేషితోద్యమ రీతి
ప
తనయ క్రమములకు – క్షమా – పణ నొందినవాడు – తన పాపములకు బ్రాయశ్చిత్తము – పొందినవాడును ధన్యుడౌ ॥తనయ॥
1.
దేవుని చేత వి – రోధిగా – దీర్చబడనివాడు – భావంబున లేశంబైనను గ – పటము లేనివాడును ధన్యుడౌ ॥తనయ॥
2.
మును నేను మౌని – నై దిన – దినమున నెసనర్చిన నా యా ర ధ్వనిచే క్షీణించెను నా యెముకలు సకలంబకటా ॥తనయ॥
3.
రేయి పగలు నా మీద – నీ చేయి భారమయె – గాయము నందలి సారము వేసవి – కాలంబున నెండిన విధమాయెను ॥తనయ॥
4.
కప్పుకొనకయే నీ – యెదుట గలుష మెప్పుకొంటి – నొప్పుకొందు నన్న క్రమ – మోరుపుతోడ బాపము మన్నించితివి ॥తనయ॥
5.
కావున నీ సంద – ర్శనపు గాలమందు భక్తుల్ – భావము రంజిల్ల నిన్ను బ్రార్థింతు – ప్రవాహంబులు వారలపై బొరలవు ॥తనయ॥
6.
దాగు చోటు నీవే శ్రమలను – దప్పించెద గీవే – వేగ విమోచన గానంబులతో – విడువక నీవే యావరింతువు ॥తనయ॥
7.
నీకు నుపదేశింతు – మార్గము – నీకును బోధింతు – నీ కాలోచన నే జెప్పెదను – నీ మీదను దృష్టి ఉంచి సతంబున ॥ధన్య॥
8.
జ్ఞానము లేనట్టి – గుర్రము – నైనను ఖరమువలె – నైనను మీరుండకుండ – కళ్ళెముతో నెంతో బిగించబడవలె ॥ధన్య॥
9.
కలుగుననేకములౌ – వేదనలు కడు భక్తి విహీ – నులకు నమిత కృప దేవుని విశ్వా – సుల జుట్టుకొని యుండు నిజంబుగా ॥ధన్య॥
10.
సంతోషించుడు – నీతి – మంతులారా సత్య – స్వాంతులారా మీరందరత్యంత – సంతోషంబున గానము చేయుడి ॥తనయ॥
11.
జనక తనయ పరిశు – ద్ధాత్మ – కును మహిమము గల్గు – మును పిప్పుడు నెల్లప్పుడు యుగములకును దనరారును గాక ఆమేన్ ॥జనకతనయ॥