#334Just as I am, without one plea
Author: చార్లెట్ ఇలియట్ (అను: హెచ్. హెర్మ్స్)Category: దేశీయ ప్రేషితోద్యమ రీతి
1.
ఉన్నట్లు నేను వచ్చెదన్ పాపిష్ఠు నన్ను నీవు పిలువగా నీ నెత్తురు చేత గడువమా యో గొర్రెపిల్ల దేవుని దేవా!
2.
ఉన్నట్లు నేను వచ్చెదన్ తప్పుల నొప్పుకొందున్ దప్పులను నీ మాటతో హరించుమా యో గొర్రెపిల్ల దేవుని దేవా!
3.
ఉన్నట్లు నేను వచ్చెదన్ దుఃఖంబు బాధపరచగా పాపంబు జేయ నీకుమా యో గొర్రెపిల్ల దేవుని దేవా!
4.
ఉన్నట్లు నేను వచ్చెదన్ యేసూ, హేబోధి నిండగా నా యాత్మీయ దృష్టి నీయుమా యో గొర్రెపిల్ల దేవుని దేవా!
5.
ఉన్నట్లు నేను వచ్చెదన్ నీ మాట నమ్మినట్టి నన్ను మన్నించి చేర్చుకొమ్మయా యో గొర్రెపిల్ల దేవుని దేవా!
6.
ఉన్నట్లు నేను వచ్చెదన్ నీ ప్రేమ నన్ను బిలువగా నీ వాడ నౌదు సర్వదా యో గొర్రెపిల్ల దేవుని దేవా!