←అన్ని కీర్తనలు · All SongsHymn #326 of 763
Font size:
326
నమ్మితి నయ్యా యేసయ్యా నీ
Nammiti Nayyaa Yaesayyaa Nee
క్రీస్తును నమ్ముట
ముఖారి (ఛాయ: సీయోను కన్య) · ఆట · బురాణగెడ్డి
Mukhaari (Chaya: Seeyoanu Kanya) · Aata · Buraanageddi
పల్లవి
నమ్మితి నయ్యా యేసయ్యా నీ పాదములే – నమ్మితి నయ్యా యేసయ్యా – నమ్మితి నయ్య నా – నెమ్మదిలో నిన్ను – నిమ్ముగా కృప నాపై – గుమ్మరించుము వేగ ॥నమ్మితి॥
చరణం 1
పాప భారమనేడు – మోపు మోయగ లేక – కాపు నీవే యని నీ – దాపు జేరిన నేను ॥నమ్మితి॥
చరణం 2
ఆపత్కాలమునందు – ప్రాపు నీవని వేడ – గాపాడు రక్షించు – కరుణాసముద్రుడా ॥నమ్మితి॥
చరణం 3
ఎన్ని తప్పులు నాలో – నున్న నీ దయచేత – మన్నించి రక్షించు – మహిత దేవకుమార ॥నమ్మితి॥
చరణం 4
దాసుని మొర నీవు – వేసారక విని – వాసిగా రక్షించు – పరమ జనక నన్ను ॥నమ్మితి॥