#317పశ్చాత్తాప ప్రేరేపణ
Author: యెషయా వీరమార్టిన్Composer/Ragam: ముఖారిCategory: దేశీయ ప్రేషితోద్యమ రీతి
ప
పాపము దలచకు సుమీ – పశ్చా – త్తాపము బొందు సుమీ – దాపిన యేసుని పాదంబులబడి – పాపము వీడు సుమీ ॥పాపము॥
1.
పాపము చేయకుమీ – యేసుని – గాయము రేపకుమీ – పాయక పాపము చేసిన మనసా – కాయుడు యేసు సుమీ ॥画పాపము॥
2.
గంతులు వేయకుమీ – యేసుని – చెంతకు జేరు సుమీ – వింతగ గ్రీస్తుని రక్షణామృత – బిందువు గోరు సుమీ ॥పాపము॥
3.
ఈ ధరణి నమ్మకుమీ – ఆత్మకు – శోధనలుండు సుమీ – శోధన మాన్పెడి క్రీస్తును నమ్మి – శ్రద్ధగ నుండు సుమీ ॥పాపము॥
4.
తెగువన బోరాడు సుమీ – రిపునకు – బెగ్గిలవద్దు సుమీ – తెగువగు ప్రార్థన ఖడ్గమును బట్టి – పగతుని గెల్వు సుమీ ॥పాపము॥
5.
అంతము వరకు సుమీ – రక్షణ – అంతలో వెదకు సుమీ – అంతరంగుడగు క్రీస్తు రక్షకుని – చెంతను జేరు సుమీ ॥పాపము॥