#303కాలము గతించిపోవుచున్నది
Author: పురుషోత్తము చౌదరిComposer/Ragam: జంఝూటిCategory: దేశీయ ప్రేషితోద్యమ రీతి
ప
పోయెనగా పోయెనగా – కాలము వెళ్ళి – పోయెనగా పోయెనగా – మాయా సంసార సం – పదన గూర్ప మరిగి – యా యావంతయు వ్యర్థ – మై పోయెన దరిగి ॥పోయెనగా॥
1.
ఇలలో నెందరు నీతో – నీడైనవారు – కల గని మేల్కొనిన – గతి మడిసినారు ॥పోయెనగా॥
2.
జల బుద్బుదము కంటె – చులకని బ్రతుకు – తలపోసి దీన్ని యా – శలు గొయ్యి వెదకు ॥పోయెనగా॥
3.
ఎన్నాళ్ళు సుఖ పెట్టి – నెరవౌ నీ మేను – కన్ను మూసిననాడె – కాటి పాలౌను ॥పోయెనగా॥
4.
మద మత్సరముల వెంబడి గూడి నీవు – హృదయాభిమానము – వదలుకొన్నావు ॥పోయెనగా॥
5.
చెడు దుర్గుణముల పో – షించుట విడువు – గడబాటుల నీ కన్నులు – గానం గలవే ॥పోయెనగా॥
6.
జవ్వన బలముచే – క్రొవ్వుచు నీవు – నవ్వులాటల ప్రొద్దు – నడిపి యున్నావు ॥పోయెనగా॥