FaithWalk
← Back to Library

#298యేసునొద్దకు రండి

Author: పులిపాక జగన్నాథముComposer/Ragam: మధ్యమావతిCategory: దేశీయ ప్రేషితోద్యమ రీతి
ప
రండి యేసుని యొద్దకు – ప్రియులారా మీరు – రండి యేసుని యొద్దకు – రండి రండి – రయమున బిలుచుచు – నుండెడి రక్షకు – డొసంగెను ప్రాణము ॥రండి॥
1.
మీరు పాపంబుల ద్యజించి – యేసుని కడకు – రారే వేగము విశ్వసించి – మీరు వచ్చినను – మిమ్మును ద్రోయడు – చేరెడి వారిని – చేర్చును తన దరి ॥రండి॥
2.
మీకు బ్రతుకేమి శాశ్వతము – ప్రియ జనులారా – పోకుడి యాశించి లోకమును – లోకాశలకును – లొంగుట చేతను – మీకు వెల్లినులను – మెండగు దుఃఖము ॥రండి॥
3.
మీరల జాలము చేసెదరు – ప్రియులారా వేగ – రారే కడు భాగ్యమొందెదరు – చేరవచ్చి చిర – జీవము నొందగా – పారముదంబును – బడయగ దేవుడు ॥రండి॥