#284Here, O my Lord, I see Thee face to face
Author: హొరేషియస్ బోనార్Category: ప్రభు రాత్రి భోజనము
ప
యేసూ, నిన్ను చూతు నిందు తేటగా
అగోచరార్థముల్ నే ముట్టుదన్ కృపన్ నే బట్టుకొందు గట్టిగా నీ మీద వేయుదన్ నా భారము.
నే దైవాహార విందె తిందును
ఆత్మీయ ద్రాక్షపాత్ర ద్రాగుదున్ భూభారముల్ నే భారవేయుదన్
క్షమా సౌఖ్యంబు గలుగు క్రొత్తగా.
సంగీత భోజనాల కాలము
ప్రభుండు నాకై బల్ల వేసెను
విందారగించుచు నీ తోడి నా
మాధుర్య స్వల్ప మైత్రిన్ బెంచు దన్.
సాయం కాలము వచ్చె చీకటాయెను,
నాతోడ నుండుమీ ప్రభువా.
సహాయుడవు నీవే, వేరే నా కెందుకు వేరే చెవి చూడ ననుకొనను ప్రభు.
నిజంబుగా నిదె చాలును నీ శక్తిలోనే బలం బుండున్ పాపంబు నాది, నీతి నీదెగా నేరంబు నాది శుద్ధి నీదెగా నీ రక్త నీతియే నా వస్త్రముల్ – నా కాశ్రయంబు శాంతస్థితులు.