FaithWalk
← Back to Library

#271ప్రభుని బాప్తిస్మము

Author: పురుషోత్తము చౌదరిComposer/Ragam: ముఖారిCategory: క్రీస్తు శ్రమలు — మరణము
ప
వినరే నరులారా – మనముల – వేడుకలను మీరు – మన రక్షకుండగు – మరియా తనయుని – మహిమలు చెవులార ॥వినరే॥
1.
తనకన్నను ముందు – యోహాను – నన్ను నతడొపొందు ఘనతరమగును – ప్రవచనముల్ – పల్కెను భూజనులందు ॥固定వినరే॥
2.
అతడు యోర్దాను – నదిలో – ఖ్యాతిగ ననుదినమునన్ పాతుకులకు బా – ప్తిస్మ మిచ్చు నెడం – ప్రభు వచ్చుట కరి గెన్ ॥వినరే॥
3.
న్యాయము నిలుపుటకై – ప్రభుని విధేయత గనుపరచి – శ్రేయ పతి బొం – దెను యోహానుని – చేత బాప్తిస్మంబు ॥వినరే॥
4.
పరమండలమపుడు – తెరవబడె – పావురము గతినన్ పరిశుద్ధాత్మ శు – భప్రభ లీనుచు – ప్రభువు మీద వాలెన్ ॥వినరే॥
5.
ఆకాశమునుండి – గెలిగెను – ప్రాకటమగు వరము – నా కితడ ప్రియం – బౌ కుమారుడు – నందమొంది రనుచు ॥వినరే॥
6.
అంతట మన కర్త – పరిశుద్ధాత్మ బలము గెలిమినన్ – సంతోషమున మో – క్ష కుశలవార్తను – చాటంగ దొడగెన్ ॥...వినరే॥
7.
ఆ నిత్య సువార్త – మన మేద – లో నిడి నమ్మినచో – నానందమయమౌ – నమృత మీసు ద – యా నిధి మన కొసంగున్ ॥వినరే॥