FaithWalk
← Back to Library

#269బోధకుల కొరకైన ప్రార్థన

Author: విలియం బెర్రీComposer/Ragam: శంకరాభరణముCategory: క్రీస్తు శ్రమలు — మరణము
ప
అడుగుచున్నాము దేవ – కడు దయను గావన్ – జడగులమైన మేము ని – న్నడుగుటకు నే బిడియమొందెదము – అడుగుడి మీ కీయబడు నంచు – నాథునిచ్చిన వాగ్దానమున గని ॥యడుగు॥
1.
వేడుకల రంగ గూడి నిను గొని – యాడి యడిగెడు నీదు భక్తులు – గోడు గని దయతోడ నెప్పుడు – వీడక నెరవేర్తువని ని ॥న్నడుగు॥
2.
సారెసారెకు నిన్ను విడిచి – ఘోర దురితపు భారమందున – జేరి నిన్ను మరిచితిమి గదమ్మా – క్రూరత నెడ బాపుమని ని ॥న్నడుగు॥
3.
దుష్టుడు మాతోడ బోరగా – శ్రేష్ఠమగు మానిష్ఠ తోడుత – కష్టమనక వాని గెల్వ – బుద్ధిని బుట్టించుమని ని ॥న్నడుగు॥
4.
తోరమగు విశ్వాస నిరీక్షణ – కూరిమి విమలాత్మ వరములు – వారక హృదయాంతరంగంబుల – జేర్చి మము వెలిగించుమని ని ॥న్నడుగు॥
5.
మోదమొప్పంగ నీదు వాక్యము – మేదినిపై బోధపరచెడు – బోధకులపై శోధనంబులు – పొర్లి రాకుండ నాదరింప ॥నడుగు॥
6.
దురితములచే భరితులు అయ్యెడు – నరులపై నీ కరుణ జూపి – గురుతరంబగు మారుపుట్టుక – వరమున్ గుమ్మరించుమని ని ॥న్నడుగు॥
7.
రోగములచే నేసి నొందుచు – జాగు సేయక నిన్ను దలచుచు – బాగు కోరుచునున్న భక్తుల – రోగములు వెడలించుమని ని ॥న్నడుగు॥
8.
ధరణిపైని మరణమయ్యెడు – తరుణమందో కరుణా కలితా – పరమ పురమునందు జేరి – వర సుఖంబులనుభవింప ॥నడుగు॥