#257దేవుని వాక్యము
Author: గున్నాబత్తుల సమూయేలుComposer/Ragam: కాపిCategory: క్రీస్తు శ్రమలు — మరణము
ప
శ్రీ వినోద దాయకంబు – దేవుని వాక్యంబు – జీవమునకు నాస్పదంబు – చిరముగౌ ధనంబు – భావంబుల మార్చు నంబు – బహుళ సాధనంబు ॥శ్రీ॥
1.
పాప తతికి నాయుధంబు – పాపి కాశ్రయంబు – భూపతులకు దుస్తరంబు – పుణ్య సాధనంబు – శాప మడంచెడు శరంబు – జగతికి విభవంబు ॥శ్రీ॥
2.
స్వాంతంత్ర్య మిడు ధనంబు – సర్వశ్రేష్ఠంబు – ఘాతకులకు ఖడ్గంబు – నీతికి నిలయంబు – ప్రీతిని గరపెడు విధంబు – ఖ్యాతికి పదంబు ॥శ్రీ॥
3.
సత్య విరాజితంబు – నిత్య శోభితంబు – భృత్యవరుల సంచకరంబు – భీతున కభయంబు – చేతో విభవంబు సుగుణ – శిష్యుల హారంబు ॥శ్రీ॥
4.
కర్త జూపు నద్దంబు – ఘనమహాద్భుతంబు – దురితతతికి నస్త్రంబు – దుఃఖ శోషణంబు – పరమోపదేశంబు – బహుళ మానితంబు ॥శ్రీ॥
5.
సర్వ జనులకును హితంబు – సౌఖ్య సాధనంబు – శాంతికి నిజమార్గంబు – జగడముల హరంబు – జగమునంతకును వరంబు – సత్య విజయంబు ॥శ్రీ॥
6.
కోలాహల కారణంబు – చాల ప్రాచీనంబు – మూలమౌ ధనంబు జగము – నేలెడి తంత్రంబు – జాలియెదను సూత్రంబు – మేలు భూషణంబు ॥శ్రీ॥
7.
జ్ఞానికి దుర్గ్రాహ్యంబు – దాని బోధనంబు – దీనజనుల కర్తంబు – దివ్య శోభితంబు – మానిత భక్తికి దినంబు – మానని పఠనంబు ॥శ్రీ॥