FaithWalk
← Back to Library

#256దైవ వాక్యము

Author: జేకబ్ చేంబర్లేన్Composer/Ragam: యదుకుల కాంభోజి (ఛాయ: ధరణిలోని ధనము లెల్ల)Category: క్రీస్తు శ్రమలు — మరణము
ప
మమ్ము – ప్రేమ – జేసి దేవుడు – మాకు బోధపరచునట్లుగా – ఇమ్ముగాను లేఖనముల – నిచ్చె మాకు భూమిపై ॥మమ్ము॥
1.
మా మొగంబు నద్దమందు – మేము చూచునట్లుగా – మేము గానవచ్చు మా స్థితి – మిగుల దేటగ నందులో ॥మమ్ము॥
2.
పాపమనెడు బురద గుంటను – బడిన మమ్ము నెత్తంగ – పాప రహితుండైన యేసు – ప్రాణ మిచ్చెను ప్రేమచే ॥మమ్ము॥
3.
పాపమంతయు వీడి మేము – భక్తి శరణిని నడువంగ – ప్రాపుగా దన యాత్మ నిచ్చె – ప్రాణసఖుడగు యేసుండు ॥మమ్ము॥
4.
సకల జనులు లేఖనముల – సత్యములను దెలియుచు – అకలుషముగ వాని నమ్మగా – నంపు మాత్మను రక్షకా ॥మమ్ము॥