FaithWalk
← Back to Library

#255దేవుని వాక్యానందము

Author: పురుషోత్తము చౌదరిComposer/Ragam: మోహనCategory: క్రీస్తు శ్రమలు — మరణము
ప
సుఖ మిచ్చె గద మాకు – प्रभु యేసువా నీ – సురుచిరమగు వాకు – నిఖిల కల్మష వనమునకు దవ – దహన శిఖల వలె గాల్చు నీదగు – ముఖ వికాసిత వాక్యములు బహు – సుఖము లొసంగుట వాన శ్రితాళికి ॥సుఖ మిచ్చె॥
1.
జగతి లోపల మెండుగా – నుండిన వివిధ – మగు శాస్త్రములు జూడగా – మిగుల గందరగోళమై మరి – యొక్కటి కొక్కటి విరుద్ధముగ మ – ర్త్యగణ కల్పిత మగుచునున్నవి – తగనివని ద్రోచితివి వాటిని ॥సుఖ మిచ్చె॥
2.
నీ వాక్యముల భావము – నమ్మిన పాపి – జీవుల కది జీవము – కేవలంబగు ధర్మశాస్త్రము – దేవుడిచ్చిన దొక్కటి బైబిలు – ఈ వసుధన గల సర్వ పాపులన్ – బ్రోవ వచ్చిన నిన్ను జూపెను ॥సుఖ మిచ్చె॥