#250పరిశుద్ధాత్ముని బొందుడి
Author: మండపాక కేశవరామ శర్మComposer/Ragam: కల్యాణి (ఛాయ: పరిశుద్ధాత్మను గోరుము జీవమా)Category: క్రీస్తు శ్రమలు — మరణము
ప
పరిశుద్ధాత్ముని బొందుము – ప్రభువిచ్చెడు – వరసహాయుని బొందుము – పరిశుద్ధ వర్తనకు – పరమ సహాయంబు – పరము జేరువరకు – పరిపూర్తిగా దొరకు ॥పరి॥
1.
పరిశుద్ధాత్ముని గలిగిన – మన రక్షణ – పరిపూర్ణమై యుండును – పరమ రక్షకుడిచ్చు – పరిపూర్ణ రక్షణను – పరమానందముతోడ – పరగ గైకొనుమిప్పుడే ॥పరి॥
2.
పరిశుద్ధాత్మని గలిగిన – బైబిలు వాక్య – పరమసారము తేటగున్ – పరమండలపు తండ్రి – పరిశుద్ధ చిత్తంబు – పొరపాటు లేకుండ – విరివిగా దెలియును ॥పరి॥
3.
పరిశుద్ధాత్ముని గలిగిన – ప్రార్థనలందు – పరమపాటవ మబ్బును – సరిగా ప్రార్థింపడు – సరణియు దెలియును – వరములను బొందుటకు – తెరువూల బిహరించును ॥పరి॥
4.
పరిశుద్ధాత్ముని గలిగిన – శోధనముల – పరమవిజయము గలుగును – దురితంపు శోధనల – దొలగింప నా ప్రభువు – పరమశక్తినొసంగి – కరుణతో జయమిచ్చు ॥పరి॥
5.
పరిశుద్ధాత్ముని గలిగిన – జీవితమెల్లా – పరిశుద్ధముగా నుండును – పరిశుద్ధ జీవితము – కరము సాధ్యంబగును – పరిశుద్ధాత్మని శక్తిన్ – వర్తింప గలమట్లు ॥పరి॥