FaithWalk
← Back to Library

#245పరిశుద్ధాత్మా, రమ్ము

Author: మేడికాయల సాధువుComposer/Ragam: శ్రీరాగముCategory: క్రీస్తు శ్రమలు — మరణము
ప
రమ్ము రమ్ము పరిశుద్ధాత్మా – రమ్ము రమ్ము – రమ్ము దీవింపగ – నిమ్ము నీదు కృపను – నింపుము డెందముల్ – నెమ్మది బొందగా ॥రమ్ము॥
1.
జీవంపు టూటవు – ప్రేమ జ్వాల వీవే – దేవ దానమీవే – యాదరించువాడ ॥రమ్ము॥
2.
దేవహస్త మీవే – వరములు అన్ని నీవే – నీవే తండ్రి వాగ్ద – త్తముమ్మై వెలుగుచుండు ॥రమ్ము॥
3.
మాటలాడు శక్తి – నిచ్చి నాయాత్మను – మేటిగ నన్ను నభి – షేకించుమీ దేవ ॥రమ్ము॥
4.
ఇమ్ము నీదు వెలుగు – నింపు నీ ప్రేమతో – కమ్ము నాకు తోడు – నన్ను బలపరచుమా ॥రమ్ము॥
5.
పారదోలు దేవువు – నాత్మ శత్రువుల నిం – పార నీదు నెమ్మ – దిచ్చి బ్రోవు నన్ను ॥రమ్ము॥
6.
ముందు నీవు నడువ – నన్ను డాయ దేది – యిందు నన్ను జేర్చ – వారు లేరు భువిని ॥రమ్ము॥
7.
జనకు జూపు నాకు – నట్లే జూపు సుతుని – ననయ మెరిగి దేవ నిన్ను నమ్మి జీవింప ॥రమ్ము॥
8.
జనక సుతాత్మయౌ – ఘన త్రిత్వమౌ దేవా – నిన్ను సన్నుతింపను నీదు దయనంపుమా ॥రమ్ము॥