FaithWalk
← Back to Library

#219క్రీస్తు లేచెను

Author: బి. సూర్య ప్రకాశరావుComposer/Ragam: యమునా కల్యాణి (ఛాయ: నేనును నా యింటివారును)Category: క్రీస్తు శ్రమలు — మరణము
ప
క్రీస్తు లేచెను హల్లెలూయ – క్రీస్తు నన్ను లేపును – ఇదియే సునాద సత్యము – ఇలను చాటుడి నిత్యము ॥
1.
మృతుల పునరుత్థాన పంటకు – ప్రథమ ఫలమగు క్రీస్తులో – మృతులు లేతురు నేను లేతును – నాదు వరుసలో నిజమిది ॥
2.
పాపమరణ నరక బలములు – ప్రభుని శక్తికి ఓడెను – పాపినగు నన్ను బ్రోవ క్రీస్తుని – ప్రాణదాన ప్రభావము ॥
3.
మరణమా! నీ ముల్లు ఎక్కడ? – మరణమా! జయమెక్కడ? – మరణమా! నీ ముల్లు విరిగెను – మహిమ క్రీస్తులో నిప్పుడు ॥
4.
శిలయు ముద్రయు బలిమి కావలి – గిలబిలాయెను రాత్రిలో – ఇలయు పరమును కలుసుకొనియెను – గెలుపునొందిన క్రీస్తులో ॥
5.
మృతులు నీదగువారలందరు – బ్రతికి లేతురు సత్యము – ప్రేతలను జీవింపచేయును – పృథివి క్రీస్తుని విజయము ॥
6.
స్తుతియు మహిమయు ఘనత నీకే – స్తుతికి పాత్రుడ రక్షకా – స్వంత రక్తము చింతివి నా – స్వామి యిదే నా యంజలి ॥