FaithWalk
← Back to Library

#205సిలువ ధ్యానము

Author: బేతాళ జాన్Composer/Ragam: ముఖారిCategory: క్రీస్తు శ్రమలు — మరణము
ప
ఏమి నేరంబు లేక – యామరణ స్తంభ భూమి – నాపై మోయ నాయెనను – నా యేసు – ఎంత కఠోరము లాయెను చూడీ మానవులు యెరూషలేము బయలు వెడలి – నాకేమి నేరము తోచెను ॥ఏమి॥
1.
మును విన్న దీర్ఘదర్శులు – లెన్నిన రీతిని – కన్నెకడుపున బుట్టిన – నా యేసు – వన్నె మీరంగ బెరిగిన చొక్కనైన నీ మేను – చెమట బుట్టంగ నీ – కెన్ని కడగండ్లు ఆయెనను ॥ఏమి॥
2.
కన్నతల్లి యిట్టి – కడగండ్లు గాంచిన – కడుపేరీతినోర్చును – నా యేసు – గాంచన లేనను గూలను చు నిన్నెరిగి నట్టివారు – నీ పాటులు గని యేడ్చు – చున్నారు ఈ వేళను ॥ఏమి॥
3.
అయ్యయ్యో యూదు – లెంత అన్యాయంబు దప్పి తీర్చినందు – భయంబు విడిచి పోని – నా యేసు – మోయ శక్యంబు గాని కొయ్య మూపున నెత్తి – రయ్య నీ కెంత భార – మయ్య మోసెదవ జాలను ॥ఏమి॥
4.
పిల్లలాట్లాడినట్లు – ముల్లులతో కిరీటము మల్లి నెత్తిన గొట్టిరి – నా యేసు – పల్లరులు పలికాధిక మోదరి – ఎల్లవారిలో నిన్ను – ఎగతాళి గావించి – మొగముపై నుమ్మివేసిరి ॥ఏమి॥
5.
కొరడాలతో నిన్ను – గొట్టి కండ్లకు గంత – గట్టి చేజేరి వేడకను – నా యేసు – అట్టి వారెవ్వరంచు చు – విరగ బాసంబునడిగి – వెక్కిరించుచు నీ – వెంబడి వచ్చుచున్నారు ॥ఏమి॥
6.
ఏడ్చేవారు నడువ – మోయలేక స్తంభ ములను – నేల బారిన రీతిగా – నా యేసు – మోయలేక బారినట్లుగా – ఏల యీ కొడగండంబు – లేల నీమీద కట్టుట – ఏమి నేరంబు లేదుగ ॥ఏమి॥
7.
చాల బాధించి క – పాల స్థలమునకు వచ్చి – నేల బారిన కొయ్యను – నా యేసు – జాలి రవ్వంత లేకను – కాలు సేతులనుప్పు చీలలతో బిగించ – జిమ్మే రక్తంబు గారెను ॥ఏమి॥
8.
నా దేవా నా దేవా – నన్నెందుకై విడిచి – నా వంచు మొరలిడితివి – నా యేసు – నమ్మితివి లోబడితివి – వేదనధికమాయె – నే దిక్కు లేనట్లు – యూదాళి కగపడితివి ॥ఏమి॥
9.
అంధకారము దేశ – మంతటా గెలిగెను – ఆవరించెను సూర్యుని – నా యేసు – ఆలయపు తెర చిరిగెను – బంధ స్తంభమునుండి – బహు గొప్ప శబ్దముతో బిలిచెద వేమిటను ॥ఏమి॥
10.
ఓ తండ్రి నీ చేతి – కొప్పగించుచున్నాను – ఒనరంగ నా యాత్మను – నా యేసు – అని ప్రాణమును వీడెను – ఏ తప్పిదంబు లేక – నీ పాటు నొందితివి – ఎంతో వింతై నిలుచును ॥ఏమి॥
11.
నీ చాతురుడొక్కడు నిశ్చ – యింప బల్లెముతోడ – నీ ప్రక్క బొడిచె చావను – నా యేసు – నీరు నెత్తురు గారెను – అరియున్నట్టి కసి – కెట్లు నీ యొడలు సైచె – నెంతో చోద్యంబు చూడను ॥ఏమి॥
12.
పాపాత్ములకై పూట – బడినందువలనే యింత – పరితాప మరణమాయెను – నా యేసు – ఎరిగే యనుభవించెను – నా పాప ఫల ము నిన్ను – ఏ పాటులు బెట్టి చంప – నోపితివయ్య ప్రేమను ॥ఏమి॥
13.
ఎంత అమూల్యమైన – దెంత యనంతమైన – దెంత గాధమైనది – నా యేసు – ఎంతో యుచితమైనది – ఎంతో వింతైన ప్రేమ – హేయులమైన మాకు – ఏల కనుపరచబడ్డది ॥ఏమి॥
14.
ప్రేమాతిశయుడనైన – ఏ మాత్రుడను నన్ను – నా మానసమున కందను – నా యేసు – ప్రేమ సారంబు తెలియను – పామరులను బ్రోచు – క్షేమాధికారి నిన్ను – ఏమంచు వర్ణింతును ॥ఏమి॥