#204సిలువను జూడుడి
Author: రావూరి రంగయ్యComposer/Ragam: బిలహరి (ఛాయ: మేలుకొనరే)Category: క్రీస్తు శ్రమలు — మరణము
ప
సిలువగనుడి సిలువలో వ్రేలాడు ప్రభువే – విలువ కందగరాని యీవుల – నెలమి మనకై – కొనియెగదరి – నిపుడు సాష్టాంగము లొనర్చుచు ||సిలువ||
1.
కొరత చావైనను మరణము – మనకుందెనని తగ్గించుకొని మన – కొరకు దాసుండగుచు రిక్తుని – కరణి నిట జీవము నొసంగెడు ||సిలువ||
2.
తనను నమ్మినవారు చావక – యనిశ జీవమునొంది బ్రతుకను – దన స్వపుత్రుని నిచ్చునంతగా – దండ్రి ప్రేమించెను జగంబును ||సిలువ||
3.
పాప మెరుగని వాని మనకై – పాపముగా నొనరించి దేవుడు – శాపగ్రస్తులలోన నొక్కడుగా – మా ప్రభుండండంబు చెంగట బడియెను ||సిలువ||
4.
లోకమాంస పిశాచులని యెడి – భికారుల పొంగు గృంగను – శ్రీకరుడు మన దేవుడతనియుం – డౌ కృపానిధి దీనుడయ్యెను ||సిలువ||
5.
ఘోరయుద్ధము జేసి వైరిని – గూలద్రోసిన తావిదే మన – పారమార్ధిక బలము కరమగు – ధీర శ్రేష్ఠుడు దిశలు పొగడ ||సిలువ|| దేవమిత్రుడనని – శ్రీకరుండు యెహోవా సెలవిచ్చెను ||దశమ||
6.
శరణు గలదిక పాపకోటికి – స్వామి ద్రోహపు శత్రులకు సహ – కరుణ రుధిర కణాగతంబున – కల్మష రహిత మనంత రక్షణ ||సిలువ||
7.
మాకు ప్రేమ సారమయ్యెను – మాకు జీవనాధారమయ్యెను – మాకు దృప్తి సునీరమయ్యెను – మాకు బరము విచారమయ్యెను ||సిలువ||
8.
నమ్ముదము సైన్యముల ప్రభువును – చిమ్ముదము సందియము లాత్మను – క్రమ్ముదము మోక్షపురి బాట సు – ఖమ్ము మన హృదయమ్ము లొందను ||సిలువ||