#200స్త్రీలు సిలువ చెంత ధ్యానించుట
Author: UnknownComposer/Ragam: సారంగ (ఛాయ: వచ్చి గాబ్రియేలు)Category: క్రీస్తు శ్రమలు — మరణము
ప
చేడియలు గుంపుగూడి – క్రీస్తు – జాడగని తాల్మి నిలిచి
అడికల నోర్చి నేడు మన పాలి – వాడు సిలువను – నున్నాడు గదయంచు ||చేడియలు||
1.
వారి మొగములు వాడెను – యేసు – వారి వెతలు ఎల్ల జూడెను
నీరు దృక్సర – సీరుహము లందు – జార తమ కొన – గోరులను మీటి ||చేడియలు||
2.
రొమ్ములను చేతులుంచుచు – చింత – గ్రుమ్మి నిట్టూర్పులిచ్చుచు
కొమ్మలట నిలుప – బొమ్మల చేష్ట – లెమ్ము చెడియలు – రవముతో నిల్చి ||చేడియలు||