#191సిలువ ధ్యానము
Author: UnknownComposer/Ragam: శోకవరాళిCategory: క్రీస్తు శ్రమలు — మరణము
ప
ఎంతో వింత యెంతో చింత – యేసు నాధు మరణమంత
పంతముతో జేసి రంత – సొంత ప్రజలు స్వామి నంత ||యెంతో||
1.
పట్టి కట్టి నెట్టి గొట్టి – తిట్టి రేసు నాధు నకటా
అట్టి శ్రమల నొంది పల్క – డాయె యేసు స్వామి నాడు ||యెంతో||
2.
మోయలేని మ్రాను నొక్కటి – మోపి రేసు వీపుపైన
మోయలేక మ్రానితోడ – మూర్ఛబోయె నేసు తండ్రి ||యెంతో||
3.
కొయ్యపైన యేసయ్యను బెట్టి – కాలుసేతులలోన చీలల్
కీటనులంత గూడి గొట్టిరి – ఘోరముగ క్రీస్తేసును పట్టి ||యెంతో||
4.
దాహముగొన జేదు చిరకను – ద్రావ నిడిరి ద్రోహు లకటా
ధాత్రీ ప్రజల బాధ కోర్చి – ధన్యుడు దివి కేగె నహహా ||యెంతో||
5.
బల్లెముతో ప్రక్కన బొడువన్ – పారె నీరు రక్త మహహా
ఏరై పారె యేసు రక్త – మెల్ల ప్రజల కెల్లమి నొసగు ||నెంతో||