FaithWalk
← Back to Library

#190క్రీస్తు మరణము

Author: కొత్తపల్లి జాన్Composer/Ragam: హిందుస్తానీ తోడిCategory: క్రీస్తు శ్రమలు — మరణము
ప
ఆహా యెంతటి శ్రమల బొంది – వయ్యా – దాహమాయెను నీకు సిలువపై ద్రోహులందరూ గూడి అయ్యయ్యో – నీదు – దేహంబు బాధించి రయ్యయ్యో ||ఆహా||
1.
దుష్కర్ములకు నప్పగించెనా – యూదా – ఇస్కరియోత నెడి శిష్యుడు తస్కరించిన వాని భంగిన నిన్ను – నిష్కారణముగాను పట్టిరా ||ఆహా||
2.
కలుషాత్ములందరూ గూడిరా – నిన్ను – బలువిధంబుల హింస బెట్టిరా తలపైన ముళ్ళ కిరీటముంచి యా – సిలువ నీతోనే మోయించిరా ||ఆహా||
3.
కాలుసేతులయందు వారలు – ఇనుప – చీలలు దిగగొట్టి రయ్యయ్యో జాలి సుమంతైనా జూపక – వారు – గేలిచేయుచు బాధపెట్టిరా ||ఆహా||
4.
బాధ తగ్గించు పరమాణువారలు – నీకు చేదు ద్రాక్షారసము ఇవ్వగా నీదు మనసు దానినొల్లక గొప్ప – వేదనలను భరించెనే ||ఆహా||