#189గాయపరచబడిన పరిశుద్ధ శిరస్సు
Author: రావూరి దావీదుComposer/Ragam: ముఖారి (ఛాయ: చూడరే క్రీస్తుని)Category: క్రీస్తు శ్రమలు — మరణము
ప
వందనం నీకే వందనం – పరిశుద్ధ శిరమా – వందనం – నీకే – వందనం
వందనం బొనరింతు నీ దా – నందమగు పుణ్య నామమునకై ||వందనం||
1.
సుందరుడ నీ శిరస్సు హేళన – బొందె ముండ్ల కిరీట ముంచగ
నెందెనందున జిమ్మిన రక్త బిందువులు – చిందుచుండెడి గాయములతో – గ్రంధెనా – మోము – కుందెనా
ఇంక నే – నెందు బోవక నిన్ను గొలిచెద – నందముగ మహిమ ప్రభావా ||వందనం||
2.
భీకరుడ నీ యెదుట సర్వ – లోకములు వణకెడు పుణ్యముఖ
మేఘ రణి నుమి వేయబడివి – కార రూపము నొందికందెను – శ్రీకరా – శ్రీశు – భాకరా
నే నీ ముఖ ప్రకాశము పాడుజేసితి – నో కరుణా భాస్కర క్షమించుము ||వందనం||
3.
మించు నీ ముఖ లక్షణము లహ – మంచి పెదవుల రంగ జూడగ
గొంచెమైనను గనుపడక కృ – శించి దౌడలు క్రుంగిపోవుట
నెంచగా నాలో – జించగా ఆ నీ – యంచితపు బల శౌర్యములు హ – రించి పోయెను మరణ బలమున ||వందనం||
4.
సిలువ యెదుటను నిపుడు నే నిక – నిలిచి నిన్ను బ్రార్థింతు ప్రభువా
ఖలుడనని నన్ను ద్రోయకుము నే – నలసి సొలసి నిన్ను విడువక
పిలిచెద – నిన్నే – గొలిచెద నీ తల – బలిమి చావున వాల్చగను నా – యేసు నిన్ను చేతులతో నా యెద ||వందనం||
5.
నిన్ను నే గొనియాడుటకు నిపు – డున్న భాషలు చాల విక
నెన్నెటుల నే నుతియింతునో హో – సన్న రక్షక ప్రోవు నన్నెన్నెడ బాయకు
ఖిన్నుని – జేయకు నా కొర – కిన్ని బాధల నొందితివి నా – యన్న నా జీవంబు నీదే ||వందనం||
6.
మరణ దినమున భయము పడి నీ – కొరకు ఎదురు చూడం గృపతో
వరబలుండ నా విరోధి – కరముకు శరముల ద్రుంచ రావె
శూరుడా – దేవకు – మారుడా అటు నీ – మరణ రూపము సిలువపై నా – తరుణమున జూపుము యెహోవా ||వందనం||