FaithWalk
← Back to Library

#188సిలువ ధ్యానము

Author: పురుషోత్తము చౌదరిComposer/Ragam: ముఖариCategory: క్రీస్తు శ్రమలు — మరణము
ప
చూడరే క్రీస్తుని చూడరే – నా సఖులారా – చూడరే క్రీస్తుని చూడరే చూడరే నా ముక్తి పదవికి – రేడు యేడు దశ గూడినాడో ||చూడరే||
1.
మించి పొంతి పిలాతు సత్యము – ఇంచకైన దలంప కక్కట వంచనను గొట్టించి యూదుల – మంచిదనమే కోరి అప్పగించెనా మేలుగా – క్షమించెనా ఇతని గాంచి కాంచి భక్తులెట్లు సహించిరో పరికించి మాదిరి ||చూడరే||
2.
మంటికిని నాకాశమునకును – మధ్యమున వ్రేలాడుచుండగా నంట గొట్టగా సిలువ మ్రాని – కప్పగించుట కొరకు నిన్ను గాంచెనా ఇది మది – నెంచెనా అహనా కంటె నే ఇటువంటి యాపదన – గంటి బ్రాణము లుండునా ఇంక ||చూడరే||
3.
ఊటగా రక్తంబు కారుచు – నుండ బల్లెపు ప్రక్కపోటు మాటిమాటికిని జూడ దుఃఖము – మరలునే తలమీద ముళ్ళ కిరీటమా ఇతనికి – వాటమా యూదులు – మోటులై బాహాటమున నీ పాట్లను గాటముగా జేసిరి ||చూడరే||