#187క్రీస్తుని అద్భుత ప్రేమ
Author: పురుషోత్తము చౌదరిComposer/Ragam: సౌరాష్ట్రCategory: క్రీస్తు శ్రమలు — మరణము
ప
పాపుల యెడల క్రీ – స్తుని ప్రియ మెట్టిదో – పరికింపరే కలవరి గిరిపై
నాపదలను దన – కేగతి బెట్టెడు – కాపురుషుల దెసగనుగొను కృపతో ||పాపుల||
1.
యెరూషలేము క – న్యలు కొందరు తన – యెదుట వచ్చి యేడ్చుచు నిలువన్
వరస నప్పుటికి – వచ్చు నాశన గతి – లెరుగక బలికి వారల నోదార్చెను ||పాపుల||
2.
శత్రువులటు తనను – జంపుచునుండగా – మైత్రి జూపె సమ్మతితోడన్
స్తోత్రము జేసెను – తండ్రి వీరి దురిత – మెల్ల క్షమియింపవ యనుచును ||పాపుల||
3.
తన ప్రక్కను సిలువ – ను వేసిన యొక్క – తస్కరుండించుక వేడుకొనన్
కనికరము మన – మున బెనగొన ని – చ్చెను మోక్షము తనతో నుండుటగున్ ||పాపుల||
4.
మితిలేని దురిత – జీవుల లోపల – మించి యున్న పతితుల కొరకైనన్
హితముగా మోక్షం – బిచ్చుటకై శో – ణిత మిచ్చెను నా మతి కిది సాక్షిగ ||పాపుల||