#179సిలువ యెదుట హృదయవేదన
Author: పురుషోత్తము చౌదరిComposer/Ragam: ధన్యాసిCategory: క్రీస్తు శ్రమలు — మరణము
1.
ఒక తోట లోపల – నాడు నీవు పడిన – సకల శ్రమలిచ్చోట – నికటమై యున్నట్లుగా – నిట్టూర్పులతో – దలంతు
నకట నా రాతి గుండె – శకలమై పోవునట్లుగా ||నా యన్న||
2.
పరమాశ్చర్యము గాదా – ఈలాటి ప్రేమ – ధరణిలో నున్నదా
చురుకు ముళ్ళు పోటుకు నీ – శిరము నా వంటి నీచుని – పురుగు కొరకు అర్పించిన నీ – కరుణన్ దర్శింతు నేడు ||నా యన్న||
3.
ఇచ్చక మిది గాదు – మిగుల దలపోయ – ముచ్చట దీరదు
అచ్చి వచ్చిన నా – యవతారుడ నీ ప్రక్క – గ్రుచ్చు గాయము లోపలనే – జొచ్చి నీ ప్రేమ జూతు ||నా యన్న||
4.
తల వంచి సిగ్గున – నే జేయు నేర – ముల నెంతు నాలోన
బలు మారు నీ గాయముల – గెలికి నిన్ శ్రమపరచు నా – ఖల దోషములకై యిప్పుడు – విలపించి వేడుకొందు ||నా యన్న||