#162యేసే రక్షకుడు
Author: రావూరి లక్ష్మయ్యComposer/Ragam: శంకరాభరణముCategory: క్రీస్తు జీవితము — ఉపదేశములు
ప
అన్న మన యేసు ప్రభుని – కన్న రక్షకుడు లేడు
ఎన్నరాని మన అఘములు – అన్ని సడలించి ప్రోచు ||నన్న||
1.
మన దోషములకు బదులుగా – మరణావస్థల నొందెను
తన దివ్యావయవముల ర – క్తము చింతించెను భువిపై ||నన్న||
2.
నిజ రక్షకుడితడే మన – మృజినాదుల బరిమార్చెను
విజయంబగు నతని పాద – రజ యుగ్మమును స్మరింతు ||మనన్న||
3.
దిక్కుమాలిన వారికి – దిక్కై మార్గము జూపెను
చక్కని గుణముల సొంపు – పెక్కి వర్తించె నహహా ||యన్న||
4.
ఈలాటి దయాసముద్రు – నిల నెందైనను గానము
నీలో గల దురు గుణాది – జాలములను గడద్రోయును ||అన్న||
5.
మృతి గెల్చినవాడే దు – రిత జీవుల బ్రోవ దగును
మృతి నొంది నశించు లోక – మూఢాత్మల కేల కల్గు ||నన్న||