FaithWalk
← Back to Library

#161యేసు ప్రేమను స్తుతించుట

Author: తూసిలి బెంజిమిన్Composer/Ragam: బిలహరిCategory: క్రీస్తు జీవితము — ఉపదేశములు
ప
వింతగల మా యేసు ప్రేమును – సంతోషమున స్తుతింతును పంతముగ దన ప్రాణమును పా – పులకు నియ్యను వచ్చి సిలువను – జచ్చి నన్ను రక్షించె నహహా ||వింత||
1.
ప్రీతిగల మా ప్రభుని కృప బహు – ప్రియముతో చాటింతును సాధుగా నా కొరకు సిలువను – చాల శ్రమలు భరించి చావు జ – రగించి నన్ను రక్షించె నహహా ||వింత||
2.
పాడండి మా యేసు ప్రేమను – వేడండి మది గూడండి పాడండి తన దివ్య రక్తము – పాప క్రియముగ నిచ్చి శాపము – బాపి నన్ను రక్షించె నహహా ||వింత||
3.
నిత్య జీవము నిండు నెమ్మది – నిరతముగా నా కియ్యను రక్త శ్వేదము గారె నహహా – నరక శాపము ద్రుంచి యాపద – నుండి నన్ను రక్షించె నహహా ||వింత||