FaithWalk
← Back to Library

#154ధన్యతలు

Author: పురుషోత్తము చౌదరిComposer/Ragam: యదుకుల కాంభోజిCategory: క్రీస్తు జీవితము — ఉపదేశములు
ప
నెవరూ ||నెవరూ||
1.
కవులు లాభ మరసి చేయు కపట మంత్రముల్ విధులు దేవుల బోవ దరిమి యేసు తత్వము గొనువారి కన్న ||నెవరూ||
2.
దీన మానసుల కట్టి యూప దేశ మిచ్చెను దివ్యమైన మోక్ష రాజ్యము వారిదౌనటంచు ప్రభువు తెల్పె ||నెవరూ||
3.
మృజినములకై దుఃఖించెడి సుజను లెవ్వరో వారు నిజముగ నోదార్పు బొంది నిత్య సంతోషితులని తెల్పె ||నెవరూ||
4.
శాంతి నీతి కరుణల యందా సక్తిగలవారు భూస్వా తంత్రులై పరితృప్తినొంది దయ పడసెదరని ప్రభువు తెల్పె ||నెవరూ||
5.
పరిశుద్ధ హృదయులు పరతత్పరుని జూతురు సర్వ నరుల సమాధానపరచు నరులే పరమ జనకుని సుతులు ||నెవరూ||
6.
నీతి కొరకు హింస నొందెడి నిశ్చలాత్ములు వారు ఖ్యాతిగ బరలోక రాజ్య ఘన సౌఖ్యములు ఎల్లను బడయుదురు ||నెవరూ||
7.
మనసార దేవుని మానక ప్రేమింపు మనచు నేర్పెన్ ఇంక దనబోలె నొరులను దాను ప్రేమింపగ దనర దెల్పెన్ ||నెవరూ||
8.
తన శిష్యులకు నైక్యమును ప్రేమించుట కాజ్ఞ లొనర నిచ్చె నెంతో ఘన సత్ప్రభువు కాళ్ళు గడిగి భక్తులచోట వినతుడయ్యెన్ ||నెవరూ||