#153యేసును అనుకరించుట
Author: ఈతకోట ప్రకాశముComposer/Ragam: బిలహరి (ఛాయ: మేలుకొనరే)Category: క్రీస్తు జీవితము — ఉపదేశములు
ప
నేర్చుకొనరే – యేసువాడుక –లనుదినము మీ బ్రతుకునందున
నేర్చుకొనిన – మీరు ఆయన జనుముగ నొప్పెదరు ఇలలో ||నేర్చుకొనరే||
1.
ఆలయ ఆరాధనలకు – బోయెడి యలవాటుగలిగి – చాలమారులు
ఆలయమునకు అరిగిన యా ప్రభుని వాడుక ||నేర్చుకొనరే||
2.
దైవవాక్య పఠనమందున – దీక్షగలిగియు
మరియు సుతుడు – దివ్యముగ నా గ్రంథ పఠనము జేసిన విధంబు మీరు ||నేర్చుకొనరే||
3.
పరమ తండ్రికి ప్రార్థనలు – ప్రతివేళ జేయుట
పరమ విధియని మరువకను – ప్రార్థించి మనలను నిరతమును ప్రార్థింపమనెను ||నేర్చుకొనరే||
4.
బీద పాపులు బాధితులు – బంధింపబడిన
వారి కెల్లను – ఆదరము జూపించి మేలును జేసిన విధంబు మీరు ||నేర్చుకొనరే||
5.
సువార్త ప్రకటన చేయుట – సుభాగ్యముగ దలంచి
ఈ భూమి సేవలో సువార్త చాటుచు సంచరించిన యేసు వాడుక ||నేర్చుకొనరే||
6.
అక్కరలలో దను జేరి – మక్కువతో ప్రార్థించి
వేడిన పెక్కు జనముల యక్కరలను చక్కగ దీర్చిన విధంబును ||నేర్చుకొనరే||
7.
దైవచిత్తము తీర్చుటయే తన ధర్మ విధిగ నెరిగి
యాయన ధరణిలో నా ధర్మమునకై మరణమొందిన విభుని మాదిరి ||నేర్చుకొనరే||