#135సువార్త సునాదము
Author: ఎ.బి. మాసిలామణిCategory: క్రీస్తు నామములు — బిరుదులు
ప
రండి సువార్త సునాదముతో
రంజిలు సిలువ నినాదముతో
తంబుర సితార నాదముతో
ప్రభుయేసు దయానిధి సన్నిధికి ||రండి||
1.
యేసే మానవ జాతి వికాసం
యేసే మానవ నీతి విలాసం
యేసే పతిత పావన నామం
భాసుర క్రైస్తవ శుభనామం ||రండి||
2.
యేసే దేవుని ప్రేమ స్వరూపం
యేసే సర్వేశ్వర ప్రతిరూపం
యేసే ప్రజాపతి పరమేశం
ఆశ్రిత జనుముల సుఖవాసం ||రండి||
3.
యేసే సిలువను మోసిన దైవం
యేసే ఆత్మల శాశ్వత జీవం
యేసే క్షమాపణ అధికారం
దాసుల ప్రార్థన సహకారం ||రండి||
4.
యేసే సంఘములో మన కాంతి
యేసే హృదయములో పునఃశాంతి
యేసే కుటుంబ జీవన జ్యోతి
పసిపాపల దీవెన మూర్తి ||రండి||
5.
యేసే జీవన ముక్తికి మార్గం
యేసే భక్తుల భూతల స్వర్గం
యేసే ప్రపంచ శాంతికి సూత్రం
వాసిగ నమ్మిన జనస్తోత్రం ||రండి||