#125సుమెయోను పాట
Author: సమూయేలు భాగ్యవాదముComposer/Ragam: శంకరాభరణముCategory: సాయంతనారాధన
ప
నీ సమాధానము – దాసునికిప్పుడు – నాధా దేవా యిచ్చి – నీ మాట చొప్పున పోనిచ్చుచున్నావు నాధా దేవా ||నీ సమాధానము||
1.
అన్యులకు నిన్ను బయలు పరచెడి వెలుగుగాను – నీకు నణగు ప్రజలైన యిశ్రాయేలు వారికి మహిమ గాను ||నీ సమాధానము||
2.
నరులకై నీవు ఏర్పరచిన రక్షణను నాధా దేవా – ఇదిగో నా కన్నులు చూచి యానందించుచున్నవి నాధా దేవా ||నీ సమాధానము||
3.
తండ్రికి సుతునికి పరిశుద్ధాత్మకును గలుగుగాక – మహిమ తరుగక సదాకాలము యుగయుగములకును గలుగు నామేన్ ||నీ సమాధానము||