#118బాలయేసు దర్శనము
Author: UnknownComposer/Ragam: జంఝూటిCategory: సాయంతనారాధన
ప
మేము వెళ్ళి చూచినాము – స్వామి యేసు క్రీస్తును – ప్రేమ మ్రొక్కి వచ్చినాము – మా మనంబులలరగ ||మేము||
1.
బేత్లెహేము పురములోన బీద కన్య మరియకును – బేదగా సురూపము దాల్చి వెలిసె పశుల పాకలో ||మేము||
2.
జ్ఞానులమని గర్వపడక దీనులమై నిత్యము – వాని ప్రేమ సకల ప్రజకు మానక ప్రకటింతము ||మేము||
3.
తద్దర్శనమందు మాకు పెద్ద మేలు గలిగెగా – హద్దులేని పాపమంత రద్దుపరచబడెనుగా ||మేము||
4.
మరణమెపుడో రేపో మాపో మరియెపుడో మనమెరుగము – త్వరగా పోయి పరమ గురుని దర్శనంబు జేతము ||మేము||
5.
పరిశుద్ధాత్మ జన్మ మాకు వరముగా నొసగెను – పరమ పురము మాకు హక్కు పంచెదాను నిరతము ||మేము||
6.
మాకు సర్వ గర్వమణగి మంచి మార్గమబ్బెను – మాకు నీ సువార్త చెప్ప మక్కువతో గలిగెను ||మేము||