FaithWalk
← Back to Library

#108బాలయేసునకు స్వాగతము

Author: వంతగాని పరదేశిComposer/Ragam: ఖమాస్Category: సాయంతనారాధన
ప
కొనియాడదరమే నిన్ను – కోమల హృదయ – కొనియాడదరమే నిన్ను తనరారు దినకరు – బెనుతారలను మించు ఘనతేజమున నొప్పు – కాంతిమంతుడ గీవు ||కొనియాడ||
1.
కెరూబులు సెరాపులు – మరి దూతగణములు – నూరు తరంబుగ గొలువ – నొప్పు శ్రేష్ఠుడ గీవు ||కొనియాడ||
2.
సర్వ లోకంబులన్ బరువు దేవుడవయ్యు – నుర్వి స్త్రీ గర్భాన నుద్భవించితి గీవు ||కొనియాడ||
3.
విశ్వమంతయు నేలు వీరాసనుడవయ్యు – పశుశాల తొట్టిలో పండయుంటివి నీవు ||కొనియాడ||
4.
దోషంబులను మడియ దాసాలి గరుణించి – యేసు పేరున జగతి కేతెంచితి నీవు ||కొనియాడ||
5.
నరులయందున గరుణ ధర సమాధానంబు – చిరకాలమును మహిమ పరగ జేయుదు నీవు ||కొనియాడ||
6.
ఓ యేసు పాన్పుగ నా యాత్మ చేకొని – శ్రేయముగ బవలించు నక్షర వరసుత ||కొనియాడ||