FaithWalk
← Back to Library

#103Hail to the Lord's Anointed

Author: జేమ్స్ మాంట్‌గోమరి (అను: బర్నార్డ్ లూకాస్)Category: సాయంతనారాధన
1.
నమస్కరింప రండి దావీదు పుత్రుని శ్రీ యేసు రక్షకుడు ఏతెంచె భూమికి న్యాయంబు లోకమందు స్థాపించి నిత్యము అన్యాయమంత దానె పోగొట్టవచ్చెను.
2.
వర్షంబు పడునట్లు శోషించు నేలను దుఃఖించు వారి కెల్ల హర్షంబు నిచ్చును శ్రీ యేసు రాజ్యమందు సద్భక్తులందరు ఖర్జూర వృక్ష రీతిన్ వర్ధిల్లుచుందురు.
3.
దిగంతవాసులైన భూరాజులందరు శ్రీ యేసు చరణంబుల్ నమస్కరింతురు భూలోకవాసులైన జనంబులందరు క్రీస్తు స్వాధీనమందు జీవింతు రెప్పుడు.
4.
విరోధులైన వారిన్ జయింప నెన్నడున్ సింహాసనంబు మీద ఆసీనుడగును అత్యంత ప్రేమమూర్తి శ్రీ యేసు ప్రభువు ఆ దివ్య నామ కీర్తి వ్యాపించు నీ భువిన్.